ఉద్యోగుల పదోన్నతుల కోసం కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో ముఖ్యమంత్రికి ఉద్యోగసంఘాల ఐకాస కృతజ్ఞతలు తెలిపింది.
ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారంలో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి యావత్ తెలంగాణ ఉద్యోగుల పక్షాన ఐకాస అధ్యక్షుడు రాజేందర్, జనరల్ సెక్రటరీ మమత ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ముందుంచిన మరిన్ని డిమాండ్లను త్వరతో పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కారిచడంలో చొరవ చూపిన కేటీఆర్కు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు: సీఎం కేసీఆర్