ETV Bharat / city

మహా హారతి ఏర్పాట్లను పర్యవేక్షించిన కిషన్​రెడ్డి - తెలంగాణ వార్తలు

నెక్లెస్​ రోడ్​ పీపుల్స్​ ప్లాజా వద్ద భారతమాతకు మహా హారతి ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పర్యవేక్షించారు. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

భారతమాతకు మహా హారతి ఏర్పాట్లను పర్యవేక్షించిన కేంద్రమంత్రి

author img

By

Published : Jan 26, 2021, 7:27 AM IST

భారతమాతకు మహా హారతి కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గత నాలుగేళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి విద్యార్థినుల భారత మాత వేషధారణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద భారతమాతకు మహా హారతి ఏర్పాట్లను కిషన్ రెడ్డి పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

భారత మాతకు సప్త హారతుల కార్యక్రమంలో స్వామి పరిపూర్ణానంద, సిరివెన్నెల, నాగఫణి శర్మలతో పాటు మేధావులు, విద్యావేత్తలు పాల్గొంటారని తెలిపారు. అంబేడ్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిరంతరం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: జెండా పండుగకు ముస్తాబు చేసిన ప్రాంగణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.