జన ఆశీర్వాద విజయంవంతం కావడంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ... కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో అందరికి సేవ చేయడానికి ప్రయత్నం చేద్దామన్నారు. తాను నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ప్రధానిమోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల మద్దతు ఎంతవరకు ఉందో స్పష్టంగా తెలిందని అన్నారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) రాష్ట్రంలో మూడు రోజులు పాటు చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర (JanAshirvadYatra) ఘనంగా ముగిసింది. యాత్రలో పార్టీ రాష్ట్ర అధినేతలతో పాటు, పెద్దసంఖ్యలో కమలం పార్టీ కార్యకర్తలు... పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు...
మూడు రోజుల పాటు సాగిన యాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించారు. 12 జిల్లాలు 17 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 305 కిలోమీటర్ల మేర యాత్ర జరగింది. యాత్రలో భాగంగా 40 చోట్ల సభలు నిర్వహించారు.
ఇదీ చూడండి: kishan reddy: 'రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది భాజపే'