Kishan Reddy leg injured: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనారోగ్యం పాలయ్యారు. గతంలో ఆయన మడమకు గతంలో దెబ్బ తగిలి గాయమయింది. ఆ గాయం ఇప్పుడు మళ్లీ తిరగబెట్టింది. ఈ మధ్య కాలి నొప్పి ఎక్కువగా ఉండటంతో... గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎక్స్‌రే అనంతరం కిషన్‌రెడ్డి మడమ వద్ద ఎముకలో పగుళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే వైద్యులు కాలు మడమ వద్ద పట్టీ కట్టారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి దిల్లీలో ఉన్నారు.
అంతకుముందు రెండు రోజుల క్రితం మునుగోడులో భాజపా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన అగ్రనాయకత్వం, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కోమటిరెడ్డి ర్యాలీగా బయలుదేరారు. బంగారి గడ్డ నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కోమటిరెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, వెంకటస్వామి, మనోహర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు.
భాజపా నేతలు ఇప్పటికే మునుగోడులో తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. పోలింగ్ తేదీ అయిన నవంబర్ 3నాటికి ప్రతి ఇంటికీ కనీసం మూడు, లేదా నాలుగు సార్లు వెళ్లి ప్రతీ ఓటరును కలిసి కమలం పువ్వుకి ఓటేసేలా ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. హుజురాబాద్‌లో తెలంగాణ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లే ఇక్కడ కూడా పాల్గొనే అవకాశాలున్న నేపథ్యంలో శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నాయకత్వం నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. 15వ తేదీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పూర్తి స్థాయిలో మునుగోడు ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రచారం గడువు ముగిసే వరకు భాజపా కీలక నేతలంతా మునుగోడులోనే మకాం వేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఇప్పుడు కిషన్‌రెడ్డి కాలికి గాయం కావడంతో ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.