Kanipakam: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయ సమీపంలోని గోడౌన్ పక్కన స్వామివారి రథానికి సంబంధించిన పాత చక్రాలను తగులబెట్టడం కలకలం రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం తుప్పుపట్టిన రథం చక్రాలను గోడౌన్ పక్కన ఉంచినట్లు అధికారులు తెలిపారు. వాటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు చెప్పారు.
పాత రథ చక్రాలను తగులబెట్టడంపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో గతంలోనూ పలు ఆలయాల్లో ఇలాగే గుర్తు తెలియని దుండగులు రథాలు తగులబెట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం.. హిందూ సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ఆగ్రహానికి దారితీశాయి.
ఇదీ చదవండి: నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!