ETV Bharat / city

స్మార్ట్​ఫోన్​ యూనివర్సిటీలో అంతసేపు అవసరమా..?

ఐదు నిమిషాలు ఫోన్​ లేకుండా ఉంటారా..? పడుకున్నాక.. మధ్యలో మెళకువ వస్తే.. ఫోన్ టచ్​ చేయకుండా ఉండగలుగుతున్నారా..? వామ్మో అలా ఉండటం మావళ్ల కాదంటారా..! కాదు కాదు.. ఉండాలి. ఆరోగ్యాన్ని పెంచుకోలేని.. ఈ రోజుల్లో కనీసం కాపాడుకునే ప్రయత్నమైనా చేయాలి కదా.

స్మార్ట్​ఫోన్​ యూనివర్సిటీలో అంతసేపు అవసరమా..?
స్మార్ట్​ఫోన్​ యూనివర్సిటీలో అంతసేపు అవసరమా..?
author img

By

Published : Mar 20, 2021, 5:10 AM IST

అన్నం తినడం గంట ఆలస్యమైనా.. పర్వాలేదు. ఫోన్ మాత్రం మాట్లాడాలి. లేకపోతే అస్సలు భోజనం రుచి కలగదు. అమ్మనాన్నతో మాట్లాడి నెల రోజులైనా పట్టించుకోం. సోషల్ మీడియా యూనివర్సిటీలో మాత్రం షేర్​, లైక్​ చేయకపోతే తట్టుకోలేం. ఓ పక్క క్లాస్​ రూంలో టీచర్ పాఠం చెబుతుంది... మనసంతా ఫేస్​బుక్​లో ఎన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్​లు​వచ్చాయోనని లాగుతుంది. ఎందుకింత ఫోన్​కు బానిసలవుతున్నామని ఒక్కసారైనా.. ప్రశ్నించుకోవాలి.

రాము ఫోన్​ వాడటంలో మహా యాక్టివ్. పడుకునే ముందు ఫ్రెండ్స్​కు గుడ్​నైట్​ చెప్పడం అలవాటు. ఆ శుభరాత్రి కాస్త.. శుభోదయం వరకూ.. వెళ్తోంది. ఫలితం నిద్ర ఉండదు. పడుకుందామనుకునే లోపు.. పదేపదే వచ్చే నోటిఫికేషన్లు. ఎక్కడి నుంచి వచ్చాయోనని ఓ ఆత్రత. ఇలా మన ఆరోగ్యానికి మనమే వైరస్ ఎక్కిస్తున్నాం. అంతేనా.. ఫోన్​ వాడుతూ కుటుంబాన్ని పట్టించుకోని తల్లి. ఇయర్​ ఫోన్​ పెట్టుకుని రోడ్డుదాటుతూ.. చనిపోయిన యువకుడు.. ఇలా ఎన్ని ఘోరాలు జరుగుతున్న మార్పు మాత్రం శూన్యం.

సర్వేలు చెప్పే మాట..

⦁ గంటకి 5 సార్లు ఫోన్ చూసే యువత 40 శాతం మంది.

⦁ రోజుకు 253 సార్లు ఫోన్ చూసుకుంటున్న యువత 50 శాతం.

⦁ ఇంటర్నెట్ వాడుతున్నవారిలో 62 శాతం మంది సామాజిక మాధ్యమాల్లోనే గడిపేస్తున్నారు.

లేచినప్పటి నుంచి పడుకునే వరకు..

ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఉండి.. ఏమైందో అని ఆత్రతతో ఉంటే ఉదయం అయిందని అర్థం. పడుకుందామనుకుని పదేపదే ఫోన్ టచ్ చేస్తున్నారంటే.. రాత్రి అయిందని అర్థం. ఫోన్​ రింగ్​తో నిద్ర లేవడం. బెడ్​పైకి వెళ్లాక.. చివరిసారిగా ఫోన్ చూసి పడుకోవడం. 78 శాతం మంది లేచిన 5 నిమిషాల్లోనే ఫోన్​ను చేతిలో పట్టుకునేవారు. ఒక వ్యక్తి రోజులో 50 నుంచి 60 సార్లు తమ స్క్రీన్​ను అన్ లాక్ చేసి చూసుకుంటున్నారట. అవసరం లేకపోయినా తమ ఫోన్​ను అరచేతిలో పెట్టుకొని రోజులో 90 సార్లు చూసేవారు 20 శాతం పైనే.

ఫోన్​ ఎక్కువగా వాడితే..!

రింగ్జయిటీ: ఫోన్ రింగ్ అవ్వకపోయినా..రింగ్ అయినట్టు అనిపించడం.

ఫాన్టామ్​ పాకెట్ వైబ్రెషన్ సిండ్రోమ్: ఫోన్ వైబ్రేషన్ మోడ్​లో పెట్టుకున్నప్పుడు కారణం లేకుండా పదేపదే చూసుకోవడం. వైబ్రేట్ అవుతుందేమోనని భ్రమపడటం.

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్: పదేపదే మానిటర్​ను చూడటం వల్ల ఏర్పడే దృష్టి లోపం

ఇన్ సోమ్నియా: నిద్రలేమి

మెలటోనిన్ తగ్గిపోతుంది..!

మెలటోనిన్​.. మనకు నిద్రపుచ్చే హార్మోన్. ఫోన్​ నుంచి విడుదలయ్యే నీలి రంగు కిరణాలు ఈ హార్మోన్​ను తగ్గిస్తాయి. మెలటోనిన్ లెవెల్స్ సరిగ్గా ఉంటే.. గాఢ నిద్ర. లేకపోతే నిద్ర కరవే.

ఇవీ పాటించండి

⦁ నిద్రపోయే 30 నిమిషాల ముందు ఫోన్ పక్కన పెట్టడం మంచిది.

⦁ కాసేపు నడవండి, వీలైతే ఏదైనా ఆడండి.

⦁ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఫోన్ స్విఛాఫ్ చేయాలి

⦁ తినేటప్పుడు ఫోన్ అస్సలు చూడొద్దు.

⦁ రోజు కొంత సమయమే ఫోన్ వాడాలనే నియమం పెట్టుకోవాలి.

⦁ ప్రతి దాన్నీ కెమెరాలోనే బంధించాలనుకోవద్దు. మీ కళ్లతో ఆస్వాదించండి.

⦁ నోటిఫికేషన్స్ ఆఫ్ చెయ్యండి.

⦁ అవసరం లేని యాప్స్ డిలీట్ చెయ్యండి.

⦁ పుస్తకాలు చదవడం హాబీగా చేసుకోండి.

ఇదీ చదవండి: నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో 55 మంది ఎలిమినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.