చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ ఘటనలో కనకయ్యను విడుదల చేయాలని కోదండరెడ్డి కోరారు. కనకయ్యను విడుదల చేయడానికి చొరవ చూపాలని గవర్నర్ తమిళిసైను కోరామని చెప్పారు. కనకయ్యను జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు పట్టదారు పాస్ బుక్ ఇచ్చారని... ఇన్నిరోజులు పాస్‌బుక్ అలస్యం కావడానికి కారణం ఏమిటో తక్షణమే చెప్పాలని డిమాండ్ చేశారు. విజయారెడ్డి సజీవ దహన ఘటనపై ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన రాలేదని ఆక్షేపించారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'