ETV Bharat / city

ఆ గ్రామాల్లో చూపుడు వేలుపై ఇంకు పడదు.. కారణమేంటంటే..? - kurnool district

అక్కడున్న వారికి ఎన్నికలు తెలుసు.. కానీ ఓటు మాత్రం వేయరు. ఒకరిద్దరూ కాదు వందల సంఖ్యలోనే ఉన్నారు అలా..! ఒక్క గ్రామంలోనే కాదు.. చాలా గ్రామాల్లో చూపుడు వేలుపై ఇంకు పడని పరిస్థితి. కారణం.. ఏళ్ల తరబడి ఏకగ్రీవాలు కావడమే. ఇదేదో గ్రామస్థులంతా కలిసి ఏకాభిప్రాయంతో చేసిన ఏకగ్రీవాలు కాదు...! ఓ కుటుంబం, ఓ వర్గం శాసిస్తే జరిగేవి. అక్కడ వాళ్ల మాటే శాసనం.. వారి నిర్ణయమే వేదం. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఇలాంటి గ్రామాల్లో కొన్నిచోట్ల పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. ఈసారి పల్లె పోరులో తొలిసారిగా పోటీ జరుగుతుండగా.. మరికొన్నింట్లో ఏకగ్రీవ తంతే దిక్కైంది.

unanimous-elections-in-kurnool-district
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021
author img

By

Published : Feb 8, 2021, 8:02 AM IST

ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు.. వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది. వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది. కానీ చాలామంది స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి. కారణం గ్రామ పెద్దలంతా ఒకే మాటపై నడిచి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారనుకుంటే పొరపాటే. భయం గుప్పిట్లో ఒక కుటుంబం శాసిస్తే అందుకు గ్రామ ప్రజలంతా తల ఊపుతున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇలాంటి గ్రామాల్లో గత కొన్నేళ్లుగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలే అవుతూ వస్తున్నాయి. ప్రస్తుత పల్లెపోరులో చైతన్యం పెరిగి కొన్నింట తొలిసారి ఎన్నికలు జరుగుతుండగా, మరికొన్నింటిలో ఇంకా శాసించే చేతుల కిందే ఓట్లు నలిగిపోతున్నాయి.

ఈ‘సారీ’..

గుండ్లసింగవరం, అన్నవరం... ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరిగి దాదాపు 40 ఏళ్లు కావస్తోంది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత గ్రామం గుండ్లసింగవరం కావడంతో ఆయన ఎంపిక చేసిన అభ్యర్థినే సర్పంచిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఏకగ్రీవాలతో ఈ గ్రామంలో 2,400 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కొన్నేళ్లుగా ఉపయోగించుకోలేని పరిస్థితి. ఈసారైనా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉర్రూతలూగుతున్న ఓటర్లకు చుక్కెదురే అయింది. ప్రస్తుతం ఈ రెండు పంచాయతీలకు వైకాపా మద్దతు ఉన్నవారే నామినేషన్లు వేశారు. దీంతో ఈసారీ ఈ గ్రామాలు ఏకగ్రీవాలకే అడుగులు వేయనున్నాయి.

చానా ఏళ్లకు ఓట్లు..

పాత ముచ్చుమర్రిలో 2,710 మంది ఓటర్లు ఉండగా, కొత్త ముచ్చుమర్రి 1,839 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీలు 50 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతున్నాయి. కారణం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించిన అభ్యర్థే సర్పంచిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో బైరెడ్డి సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి వైకాపా తరఫున అభ్యర్థిని ప్రకటించి నిలబెట్టడంతో చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు

ఇంకా అదే పంథాలో..

ఎమ్మిగనూరు పరిధిలోని కడిమెట్ల గ్రామ పంచాయతీ 50 ఏళ్లుగా ఏకగ్రీవంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సొంత గ్రామం ఎర్రకోట మజారా గ్రామం కావడంతో కడిమెట్ల అభ్యర్థి ఎంపిక ఆయన కనుసన్నల్లోనే ఏళ్ల తరబడి జరుగుతోంది. దీంతో ఈ పంచాయతీలోని 6,400 ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దాఖలాల్లేవు. ఈ దఫా ఎన్నికల్లో సైతం ఏకగ్రీవానికే పావులు కదుపుతున్నారు. ఇక్కడ సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఏజెంట్లు కూర్చోలేని పరిస్థితి నెలకొంది.

69 ఏళ్ల తర్వాత చూపుడు వేలుపై ఇంకు..

నంద్యాల మండల పరిధిలో ఉన్న భీమవరం గ్రామ పంచాయతీ 1952లో ఏర్పడింది. 69 ఏళ్లలో ఇప్పటివరకు 11 దఫాలుగా జరిగిన సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవాలే అయ్యాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే గోపవరం రామిరెడ్డి కుటుంబీకులు, సూచించిన అభ్యర్థులతో ఏకగ్రీవాలవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 69 ఏళ్ల తర్వాత ఈ గ్రామంలో తొలిసారి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అందుకే అక్కడ..

మంత్రాలయం పరిధిలోని కాచాపురం, కగ్గల్లు, రాంపురం, బసాపురం ఈ నాలుగు గ్రామాలకు 40 ఏళ్లపైగా పోటీనే లేదు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం రాంపురం కావడం, మిగిలిన మూడు చోట్ల బంధువర్గం ఉండటంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే వాళ్లకే ఏకగ్రీవంగా పంచాయతీ కట్టబెట్టాల్సిందే. రాంపురం(2,226), బసాపురం(1,691), కాచాపురం(2,628), కగ్గల్లు(954) ఓటర్లకు ఈ దఫా ఓటు హక్కు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం నాలుగో విడత ఎన్నికల్లో ఈ గ్రామాలకు అభ్యర్థులు పోటీకి దిగితే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.