సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపు పూర్తయింది. బుధవారం ప్రారంభమైన హుండీ లెక్కింపు.. రెండు రోజులపాటు సాగింది. ఆలయ మహామండప మొదటి అంతస్తులో కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ ఈఓజి. మనోహర్ రెడ్డి, ఆణువంశిక ధర్మకర్త కామేశ్వర్ హాజరయ్యారు. రెండు రోజులపాటు హుండీ లెక్కింపు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
బోనాల ద్వారా దాదాపు 64 లక్షల రూపాయలు నగదు, 235 గ్రాముల బంగారం ఆలయానికి సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయంలో అన్ని రకాల కరోనా జాగ్రత్తలు తీసుకుని డబ్బులను లెక్కించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:
Telangana Culture: మల్లికార్జున స్వామికి మైలపోలు తీస్తారట.. ఎక్కడంటే..?