MLA Sofa Opening: రిబ్బన్ కట్ చేసి కార్యాలయాలు, షాపింగ్‌మాల్స్, నూతన నిర్మాణాలు ప్రారంభించడం సర్వసాధారణం.. యంత్రాలు, వాహనాలను కూడా రిబ్బన్లు కట్ చేసి ఓపెన్ చేయటం అడపాదడపా చూస్తుంటాం. అయితే.. కుర్చీలు, సోఫాలకు రిబ్బన్ కట్టి.. వాటిని ఓ ఎమ్మెల్యేతో కట్ చేపించి ప్రారంభించటమే అసలైన వెరైటీ. అచ్చం అలాంటి సంఘటనే జరిగింది ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఉదయగిరిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న వైకాపా కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు కొంత అత్యుత్సాహంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోఫాలు, కుర్చీలకు కూడా రిబ్బన్లు కట్టారు. వాళ్లు కట్టడం వరకు బాగానే ఉన్నా.. వాటిని కూడా కట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుర్చీలు, సోఫాలకు కట్టిన రిబ్బన్లను సదరు ఎమ్మెల్యే కత్తెరతో కట్ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవీ చూడండి: