భారీ శబ్దంతో పేలిన బాణాసంచా (రాకెట్) కారణంగా విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ల చెవుల్లో గాయాలైన ఘటన ఇది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. కార్మికనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి టపాసుల శబ్దాలు భరించలేక డయల్ 100కు స్థానికుడు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఠాణాకు కానిస్టేబుళ్లు సందీప్, భీష్మకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని నరేష్ ఆధ్వర్యంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్నట్లు గుర్తించారు. కానిస్టేబుల్ సందీప్, నరేష్ స్నేహితుడైన ఎస్సార్‌నగర్ కానిస్టేబుల్ ప్రశాంత్‌తో మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వదిలిన రాకెట్ నేరుగా కానిస్టేబుళ్లు ఉన్న ప్రాంతానికి వచ్చి పేలింది.
పోలీసులు ఇద్దరికీ శుక్రవారం భరించలేని చెవి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. సందీప్ కుడి చెవిలో రంధ్రం ఏర్పడిందని, భీష్మకుమార్ కుడి చెవికి పగులు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. సందీప్ ఫిర్యాదు మేరకు ఊరేగింపు నిర్వాహకుడు నరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: Hyderabad Metro : 'మెట్రో ప్రయాణికులారా.. బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు'