ETV Bharat / city

డ్రగ్స్​ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్​ - two foreigners arrested for drugs selling

హైదరాబాద్​లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను ఎక్సైజ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. పాలస్తీనాకు చెందిన సయిద్​ అలీ, ఒమన్​కు చెందిన అబ్దురబు నుంచి లక్ష రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

two foreigners arrested for drugs selling
డ్రగ్స్​ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్​
author img

By

Published : Dec 14, 2019, 10:27 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్ష రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పాలస్తీనాకు చెందిన సయిద్ అలీ పదేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం హైదరాబాద్​కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్​కు అలవాటు పడి.. దాన్నే విక్రయించడం మొదలు పెట్టాడు. గతేడాది జులైలో డ్రగ్స్ విక్రయిస్తూ అమీర్​పేట్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి జైలు నుంచి బయటికి వచ్చాడు.

ఒమన్​కు చెందిన అబ్దురబు ఐదేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మత్తు పదార్థాలకు బానిసై ఇంజినీరింగ్ పరీక్షల్లో తప్పాడు. పాతబస్తీకి చెందిన ఓ యువతిని మోసం చేసిన కేసులో కూడా ఇతనిపై పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. దీంతో డబ్బుల కోసం మత్తు పదార్థాలు విక్రయించడం మొదలు పెట్టాడు. సయీద్, అబ్దురబు కలిసి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. నిఘా పెట్టి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీళ్లకు డ్రగ్స్ విక్రయించిన ఇద్దరూ పరారీలో ఉన్నారు.

ఇదీ చదవండి 'ప్లాస్టిక్​పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!

TG_HYD_71_14_DRUGS_ARREST_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ NOTE- ఫీడ్ డెస్క్ వాట్సాప్ కు వచ్చింది. ( ) బంజారాహిల్స్ లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పాలస్తీనాకు చెందిన సయిద్ అలీ పదేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ కు వచ్చాడు. డ్రగ్స్ కు అలవాటు పడి దాన్నే విక్రయించడం మొదలు పెట్టాడు. గతేడాది జూలైలో డ్రగ్స్ విక్రయిస్తూ అమీర్ పేట్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి జైలు నుంచి బయటికి వచ్చాడు. ఒమన్ కు చెందిన అబ్దురబు ఐదేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి హోలిమేరి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. మత్తు పదార్థాలకు బానిసై ఇంజనీరింగ్ పరీక్షల్లో తప్పాడు. పాతబస్తీకి చెందిన ఓ యువతిని మోసం చేసిన కేసులో ఇతనిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో డబ్బుల కోసం మత్తు పదార్థాల విక్రయించడం మొదలు పెట్టాడు. సయీద్, అబ్దురబు కలిసి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. నిఘా పెట్టి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీళ్లకు డ్రగ్స్ విక్రయించిన ఇద్దరూ పరారీలో ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.