AP New Districts: ప్రాంతాలుగా విభజించినపుడో.. విడిపోయినపుడో ఒక్కోసారి కొన్ని ప్రదేశాలు ఒకటి కంటే ఎక్కువ సరిహద్దులుగా మారిపోతాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అలాంటి పరిస్థితే చోటుచేసుకుంది.
రెండు మండలాలు, రెండు నియోజకవర్గాలే కాదు, రెండు వేర్వేరు జిల్లాలకు సరిహద్దుగా మారింది ఈ వీధి. కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలంలోని తాడిపూడి, పోలవరం నియోజకవర్గంలోని గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మిదేవిపేట గ్రామాలు.. వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ఒకే వీధిలో కుడివైపున ఉన్న తాడిపూడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి మారగా, ఎడమ వైపున ఉన్న మహాలక్ష్మిదేవిపేట ఏలూరు జిల్లాలో ఉంది.