ETV Bharat / city

పొగ తాగితే 28 రోగాలు.. క్యాన్సర్‌, గుండె పోటు కూడా.. - పొగతాగితే కాన్సర్​

పొగ రాయుళ్లూ.. తస్మాత్‌ జాగ్రత్త..! వెంటనే ఆ అలవాటు వీడండి. లేకుంటే 28 రకాల రోగాలు పట్టి పీడించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు.. పొగ తాగని వారితో పోలిస్తే, 30 శాతం అధికంగా రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

పొగ తాగితే 28 రోగాలు.. క్యాన్సర్‌, గుండె పోటు కూడా..

author img

By

Published : Aug 11, 2020, 2:07 PM IST

పొగతాగేవారు సాధారణం కంటే... ఓ పది సంవత్సరాలు ముందుగా మరణించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దాదాపు లక్షా 52 వేల 483 మంది రోగుల డేటాను పరిశీలించిన తర్వాత ఈ నిర్ధరణకు వచ్చారు. వీరి అధ్యయనాన్ని ‘ఈక్లినికల్‌ మెడిసన్‌’ జర్నల్‌ ప్రచురించింది. రోజుకు పది సిగరెట్లు తాగేవారిని తక్కువ స్థాయి జాబితాలోకి, 10 నుంచి 19 మధ్య తాగేవారిని మధ్యస్థ జాబితాలోకి.. 20 కంటే ఎక్కువ తాగేవారిని ప్రమాదకర జాబితాలో చేర్చింది. రోజూ సిగరెట్‌ తాగడం వలన క్యాన్సర్‌, శ్వాస, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది. వీటితో పాటు మూత్ర పిండాల వైఫల్యం, న్యుమోనియా, కంటి సమస్యలు, రక్తం విషతుల్యం కావడం.. ఇలా అనేకానేక రోగాలు పొగ తాగేవారిని కబళిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పొగ తాగుతున్న వారి సంఖ్య తగ్గుతున్నా.. ప్రపంచ జనాభాలో పదిహేనేళ్ల పైబడిన జనాభాలో 20 శాతం మందిలో ఇంకా ఈ దురలవాటు ఉందని పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎలీనా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.