టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరైంది. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, మోసం కేసుల్లో ప్రధాన నిందితునిగా ఉన్న రవిప్రకాశ్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల రెండు పూచికత్తులతోపాటు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. వారానికోసారి పోలీసుల ముందు హాజరుకావాలని సూచించింది.
సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో రవిప్రకాశ్ పై ఇవాళ మరో కేసు నమోదైంది. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి మోసం చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్ జైలు నుంచి విడుదలకాగానే ఈకేసులో విచారించే అవకాశముంది.
ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"