Mythili suicde attempt: హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పరిధిలో ఆత్మహత్యకు యత్నించిన టీవీ నటి మైథిలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన భర్త సామ శ్రీధర్‌రెడ్డి మోసం చేశాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవట్లేదన్న ఆవేదనతో.. పోలీసులకు ఫోన్ చేసిన మరీ ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు.. హుటాహుటిన తన నివాసానికి వెళ్లి మైథిలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మైథిలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారథి స్టూడియో వెనకాల ఉన్న ఓ అపార్ట్మెంట్లో టీవీ నటి నివాసం ఉంటోంది. గతంలో.. భర్త శ్రీధర్‌రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుని తనను చిత్రహింసలు పెడుతున్నాడని సూర్యాపేటలో కుటుంబసభ్యులతో కలిసి మైథిలి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో.. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌పరిధిలో నివాసముంటున్న క్రమంలో.. కట్నంగా ఇచ్చిన డబ్బు, కారు, నగలు పోయాయని ఠాణాలో ఫిర్యాదు చేసింది. తన భర్తే అన్నీ తీసుకుని ఉడాయించాడని పంజాగుట్ట పోలీసులకు వివరించింది. భర్తపై చీటింగ్ కేసు పెట్టింది. పోలీసులు పట్టించుకోకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి.. శ్రీధర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
ఇదే విషయమై.. నిన్న(మే 30న) మరోసారి పోలీసులను కలవగా.. సరైన సమాధానం రాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తాను చేసిన ఫిర్యాదు విషయంలో న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి.. స్లీపింగ్ పిల్స్ వేసుకుని లైవ్ సూసైడ్‌కు యత్నించింది. అంతకుముందు తన తండ్రికి కూడా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆమెను నిమ్స్ దవాఖానాకు తరలించారు.
శ్రీథర్రెడ్డిపై కేసు పెట్టి ఎనిమిది నెలలైనా.. తమకు న్యాయం జరగట్లేదని మైథిలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ కేసును పోలీసులు పట్టించుకోవట్లేదని.. కేవలం నోటీసులు ఇచ్చి వదిలేశారని ఆరోపించింది. తనకు న్యాయం జరగదన్న మనస్తాపంతోనే.. ఇలా చేసుకుందని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతుర్ని శ్రీధర్‌రెడ్డి వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. నిన్న సాయంత్రం తాను చనిపోతున్నానని మైథిలి ఫోన్ చేసిందని.. పంజాగుట్ట పోలీసులకు కూడా చెప్పిందని ఎల్లారెడ్డి తెలిపారు. పోలీసులే వెళ్లి మైథిలిని ఆస్పత్రిలో చేర్పిచారన్నారు. ఈ కేసులో శ్రీధర్‌తో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారని ఎల్లారెడ్డి చెబుతున్నారు. ఈ కేసులో శ్రీధర్‌రెడ్డికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేసి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: