ETV Bharat / city

Amaravati farmers on three capitals withdrawn: మిఠాయిలు పంచుకున్న తుళ్లూరు రైతులు..! - తెలంగాణ వార్తలు

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై తుళ్లూరు రైతులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు, ప్రజలకు మిఠాయిలు(tulluru farmers sharing sweets) పంచి పెట్టారు. యాత్ర కొనసాగిస్తామని అమరావతి ఐకాస స్పష్టం చేసింది.

Amaravati farmers latest news, THREE CAPITALS OF ANDHRA PRADESH IS WITHDRAWN
మిఠాయిలు పంచుకున్న తుళ్లూరు రైతులు, ఏపీ మూడు రాజధానుల బిల్లులు రద్దు
author img

By

Published : Nov 22, 2021, 4:35 PM IST

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ(THREE CAPITALS OF ANDHRA PRADESH IS WITHDRAWN)పై ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని తుళ్లూరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పోలీసులకు, ప్రజలకు లడ్డూలు పంచి పెడుతూ తమ సంతోషాన్ని తెలిపారు. 706 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే వైకాపా ప్రభుత్వం ఇప్పుడు స్పందించిందని రైతులు ఆనందంగా చెప్పారు. అలాగే సీఆర్డీఏ బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

మిఠాయిలు పంచుకున్న తుళ్లూరు రైతులు..!

మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ

మూడు రాజధానుల చట్టాన్ని(three capitals of AP withdrawn 2021) ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్​ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లును మంత్రి వర్గం రద్దు చేసిందని కోర్టుకు చెప్పారు. త్రిసభ్య ధర్మాసనానికి ఏజీ వివరాలు అందజేశారు.

స్వాగతించిన అమరావతి ఐకాస

ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి(Amaravathi jac on 3 capitals withdraws) ఐకాస ప్రకటించింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస కోరింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న ఐకాస నేతలు.. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. మహాపాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న ఐకాస నేతలు.. ఏకైక రాజధానిగా అమరావతిని(ap 3 capitals withdraws) ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటన వచ్చిన తర్వాతే ప్రభుత్వాన్ని నమ్ముతామని రైతులు స్పష్టం చేశారు.

పాదయాత్ర కొనసాగుతుంది..

అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర(amaravati farmers padayatra news)’ నేటితో 22వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర ఇవాళ నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 13 కిలోమీటర్ల మేర సాగి కొండ బిట్రగుంటలో ముగియనుంది. అంతక ముందు రైతులు స్థానికంగా ఉన్న ఓ చర్చిలో ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు. యాత్ర ముగియకముందే ఏపీ సర్కార్ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. అయినా యాత్ర కొనసాగిస్తామని అమరావతి ఐకాస స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: MLC elections in telangana 2021: ఎమ్మెల్యే కోటా ఎమెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.