తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు వెల్లడించింది. కరోనా నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ఏ రోజు.. ఏ సేవ..
- 06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు)
- 07-10-2021: ధ్వజారోహణం (ఉదయం) - పెద్దశేష వాహనసేవ (సాయంత్రం)
- 08-10-2021: చిన్నశేష వాహనసేవ (ఉదయం) - హంస వాహనసేవ (సాయంత్రం)
- 09-10-2021: సింహ వాహన సేవ (ఉదయం)- ముత్యపు పందిరి వాహన సేవ (సాయంత్రం)
- 10-10-2021: కల్పవృక్ష వాహనసేవ (ఉదయం)- సర్వభూపాల వాహనసేవ (సాయంత్రం)
- 11-10-2021: మోహినీ అవతారం (ఉదయం)- గరుడ వాహనసేవ (సాయంత్రం)
- 12-10-2021: హనుమంత వాహనసేవ (ఉదయం)- గజ వాహనసేవ (సాయంత్రం)
- 13-10-2021: సూర్యప్రభ వాహనసేవ (ఉదయం)- చంద్రప్రభ వాహనసేవ (సాయంత్రం)
- 14-10-2021: రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనసేవ (ఉదయం)- అశ్వ వాహనసేవ (సాయంత్రం)
- 15-10-2021: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)
ఇదీచూడండి: పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏమందంటే..?