తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ట్విటర్లో చేసిన విమర్శలకు సమాధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. శ్రీవారిమెట్టు వద్ద ఆందోళనకు దిగిన భక్తులపై లాఠీఛార్జ్ చేయలేదని స్పష్టం చేసింది. టోకెన్లు ఉన్నవారినే అనుమతిస్తామని భక్తులకు చెప్పినట్టు తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో.. దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న వారు మాత్రమే తిరుమలకు రావాలని ముందే చేసిన ప్రకటనను భక్తులను వివరించినట్టు వెల్లడించింది.
మరోవైపు.. వైకాపా నేతలు.. ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో చేసిన పాదయాత్రలో.. డ్రోన్ వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే.. విజిలెన్స్ అధికారులు స్పందించినట్టు తితిదే స్పష్టం చేసింది. ఆ డ్రోన్‌ను అధికారులు సీజ్ చేశారని తెలిపింది.