ttd priest veda ashirvachanam : ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణలకు తితిదే వేద పండితులు శనివారం దిల్లీలో వేదాశీర్వచనం అందజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు కృష్ణశేషాచల దీక్షితులు ఆధ్వర్యంలో తిరుమల, శ్రీశైలం ఆలయాల వేద పండితులు రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల, శ్రీశైలం ఆలయాల తరపున శాలువతో.. వారిని సన్మానించారు.
Tirumala Tirupati Devasthanam: శనివారం రోజు తిరుమల శ్రీవారిని 36,560 మంది భక్తులు దర్శించుకున్నారు. 14,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు సమకూరింది.
TTD News Year Calendar : అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రత్యేక క్యాలెండర్‌ను ముద్రించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 3డీ ఎఫెక్ట్, సిల్వర్ కోటింగ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల క్యాలెండర్‌ను తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఈవో జవహర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక్షంగా వీక్షించిన అనుభూతి కలిగేలా అధునిక పరిజ్ఞానంతో క్యాలెండర్ రూపకల్పన చేసినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 25 వేల క్యాలెండర్ల ముద్రించామని... ఒక్కోదాని ధర రూ. 450 అని వెల్లడించారు. తిరుమల, తిరుపతితోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ క్యాలెండర్ అందుబాటులో ఉంచామన్నారు.
ఇదీ చదవండి.. PUSHPA TEAM AT TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో పుష్ప చిత్ర బృందం