ETV Bharat / city

కల్యాణమస్తు కార్యక్రమంలో స్వల్ప మార్పులు - కల్యాణమస్తులో స్వల్పమార్పులు: తితిదే ఈవో

క‌ల్యాణ‌మ‌స్తు కార్యక్రమం ఏర్పాట్లపై అధికారుల‌తో తితిదే ఈవో జవహర్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. కొవిడ్ దృష్ట్యా.. ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు జవహర్ రెడ్డి ప్రకటించారు.

ttd
కల్యాణమస్తు
author img

By

Published : Mar 30, 2021, 10:18 PM IST

ఏపీవ్యాప్తంగా తితిదే నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వివాహా‌లు 'క‌ల్యాణ‌మ‌స్తు' కార్యక్రమంలో కరోనా కారణంగా స్వల్ప మార్పులు చేసినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి ప్రకటించారు. గతంలో జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని... కరోనా తీవ్రత పెరగడం వల్ల మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. తిరుప‌తిలోని తితిదే ప‌రిపాల‌న భ‌వ‌నంలో క‌ల్యాణ‌మ‌స్తు కార్యక్రమం ఏర్పాట్లపై అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వహించారు.

మే 28న సామూహిక వివాహాలు నిర్వహించడానికి తితిదే నిర్ణయం తీసుకుందని... కరోనా కారణంగా జిల్లా కేంద్రాల్లో కాకుండా నియోజకవర్గాల్లో వివాహాలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒక్కో జిల్లాలో కనీసం మూడు వందల వివాహాలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. ఆయా జిల్లా క‌లెక్టర్ల స‌హ‌కారం కోరుతూ... లేఖ‌లు రాయాలని, జంట‌ల న‌మోదు ప్రక్రియ వెంట‌నే ప్రారంభించాలని సూచించారు.

వివాహం చేసుకునే జంట‌ల‌కు రెండు గ్రాముల మంగ‌ళ‌సూత్రం, వ‌స్త్రాలు, వెండి మెట్టెలు, పుస్తక ప్రసాదం, శ్రీ ప‌ద్మావ‌తి శ్రీ‌నివాసుల ల్యామినేష‌న్ ఫొటో, భోజ‌నాలు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో జేఈవో స‌దా భార్గవి, సీవీఎస్​వో గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 140 ఎకరాల వివాదాస్పద భూమి ప్రభుత్వానిది కాదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.