జనవరి 8న హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో "గో సడక్ బంద్" నిర్వహిస్తామని తితిదే బోర్డు సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ తెలిపారు. సకలదేవతా స్వరూపమైన గోమాతను రక్షించేందుకు పోరాటం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధశాలలను మూయించాలనే డిమాండ్‌తో బంద్ నిర్వహిస్తామన్నారు. 10వేల మందితో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని తెలిపారు. అదేరోజున భవిష్యత్ ప్రణాళికను ప్రకటించి ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.
ఇదీ చదవండి : లోన్ యాప్ కేసు: రూ.21 వేలకోట్ల రుణం.. చైనీయుడి అరెస్ట్