ETV Bharat / city

తితిదే ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం.. ఆర్జిత సేవల ధరల పెంపు

ttd arjitha seva rates : తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. సుప్రభాతం రూ.రెండు వేలు, తోమాల, ఆర్చన రూ.ఐదువేలు, కల్యాణోత్సవం రూ.రెండున్నర వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.

TTD board meeting
తితిదే ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం
author img

By

Published : Feb 17, 2022, 1:48 PM IST

Updated : Feb 17, 2022, 5:19 PM IST

ttd arjitha seva rates : తిరుమలలోని అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. రెండేళ్ల క్రితం నిలిపిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని.. వాటి ధరలను పెంచాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆర్జిత సేవల ధరలు నిర్ణయించినట్లు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. సుప్రభాతం రూ.రెండు వేలు, తోమాల, ఆర్చన రూ.ఐదువేలు, కల్యాణోత్సవం రూ.రెండున్నర వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. వేద ఆశీర్వచనం రూ.ఐదువేలకు పెంచాలని సమావేశంలో నిర్ణయించారు.

తితిదే నిర్ణయాలు ఇవీ..

  • రూ.230 కోట్లతో పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
  • రూ.2.73 కోట్లతో స్విమ్స్‌ ఆసుపత్రి ఆధునికీకరణ
  • అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు
  • కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించేందుకు చర్యలు
  • తితిదే ఉద్యోగులకు నగదురహిత వైద్య సేవలకు రూ.25 కోట్లు
  • తిరుపతిలో 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం ఏర్పాటు చేస్తాం
  • తిరుపతి సైన్స్‌సెంటర్‌ భూమిలో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
  • అటవీశాఖ అనుమతి వచ్చేలోగా తాత్కాలిక పనులు చేపడతాం
  • వీలైనంత త్వరగా అన్నమయ్య మార్గాన్ని ఏర్పాటు చేస్తాం
  • మహాద్వారం, ఆనందనిలయం, బంగారు వాకిలికి బంగారు తాపడం
  • ప్రస్తుతం వచ్చే వారికి ఇబ్బంది లేకుండా నడకదారి ఏర్పాటు చేస్తాం

Last Updated : Feb 17, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.