Shivratri Special Buses to Srisailam : పండుగల రద్దీని క్యాష్ చేసుకోవడంలో టీఎస్‌ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుంది. అలాగే పండుగ పూట ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా రవాణా సౌకర్యం కల్పించడంలోనూ తెలంగాణ ఆర్టీసీ నంబర్ వన్. ఇప్పుడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.
155 ప్రత్యేక బస్సులు..
Shivratri Special Buses from Hyderabad : హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం దేవస్థానానికి 155 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రత్యేక ఛార్జీలు..
Shivratri Special Buses : ఈనెల 27న- 20 బస్సులు, 28న-57, మార్చి 1న-59, మార్చి2న- 19 బస్సులను నడిపిస్తున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. ప్రధాన బస్ స్టేషన్‌లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్‌సదన్ ప్రాంతాల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు రూ.510, డీలక్స్ బస్సులకు రూ.450, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.400 ఛార్జీలు వసూల్ చేస్తున్నామని చెప్పారు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్ లగ్జరీకి రూ.550, డీలక్స్-రూ.480, ఎక్స్‌ప్రెస్ - రూ.430 వసూల్ చేస్తున్నట్లు వివరించారు.