ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు అన్ని ప్రధాన బస్ స్టేషన్లను వైరస్ క్రిమి సంహరక ద్రావణంతో శుభ్రపరుస్తున్నారు. ప్రయాణికులు కూర్చుండే కుర్చీలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలు, బస్సుల వెలుపల, లోపల రోజుకు మూడు సార్లు శుభ్రం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఎట్టి పరిస్థితుల్లో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బస్సుల్లో ప్రయాణికులు ఎక్కే ముందు చేతులను శుభ్ర పరుచుకునేందుకు హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోమంటున్నారు. మాస్క్‌లు ఉన్న వారినే ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు