ETV Bharat / city

షరతుల్లేవ్‌.. రేపే విధుల్లో చేరండి: కేసీఆర్

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా రేపే విధుల్లో చేరాలని తెలిపారు. సమ్మెలో చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు. . తాత్కాలిక ఉద్యోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

author img

By

Published : Nov 28, 2019, 9:08 PM IST

HYD_ Join in tomorrow's duties: KCR
షరతుల్లేవ్‌.. రేపే విధుల్లో చేరండి: కేసీఆర్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం తీపికబురు చెప్పారు. 53రోజులపాటు సమ్మెలో పాల్గొన్న కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని కేసీఆర్​ ఆదేశించారు. యూనియన్ల కారణంగానే అసంబద్ధ డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగారని ముఖ్యమంత్రి అన్నారు. దీనివల్ల కార్మికుల కుటుంబాలే నష్టపోయాయని తెలిపారు.

సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే..

విపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే అని కేసీఆర్​ స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆయా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు..కార్మికుల్లో లేని ఆశలను కల్పించాయని మండిపడ్డారు.

ఆర్టీసీ సంస్థకు అవసరమైతే రూ. 100 కోట్లు

ఆర్టీసీ బతకాలనేది తమ ఉద్దేశమని సీఎం అన్నారు. ఆర్టీసీ సంస్థకు అవసరమైతే 100 కోట్ల రూపాయలు ఇస్తామని తెలిపారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని.. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి ప్రభుత్వ అనుమతి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్మికులను కాదని తాము నిర్ణయం తీసుకోమని, కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. సమ్మెలో చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు.

తాత్కాలిక ఉద్యోగుల విషయంలో సానుభూతి...

యూనియన్ల స్థానంలో ప్రతీ డిపోలో వర్కర్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తామని కేసీఆర్​ అన్నారు. సంస్థ కార్మికులదని, సంస్థ మనుగడతోనే వారి జీవితాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు. తన మాటలు వింటే బాగుపడతారని, యూనియన్ల మాట వింటే బజారున పడతారని అన్నారు. తాత్కాలిక ఉద్యోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరిస్తామని సీఎం పేర్కొన్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కేబినెట్ భేటీ షురూ... ఆర్టీసీపై కీలక చర్చ!

TG_Hyd_50_28_banjarahills_PS_Two_Person_Arrest_DCP_PC_AB_TS10021 Contributor: V. Raghu Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) అమాయక ప్రజలకు మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి 19,700 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన సురేష్‌కుమార్ చారి అనే వ్యక్తి తాను కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ గా పనిచేస్తున్నానని బంజారాహిల్స్‌లో ఇంటి స్థలంతోపాటు రెండుపడక గదుల ఇళ్లు మంజూరు చేయిస్తానని నమ్మపలికి 50మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని డీసీపీ పేర్కొన్నారు. అదే విధంగా అవినీతి నిరోధకశాఖాధికారులకు పట్టుబడిన వారి వివరాలు సేకరించి వారికి మళ్లీ ఉద్యోగాలు కల్పిస్తానని కేసులు లేకుండా చేయిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సురేష్‌కుమార్ చారితోపాటు ఇతనికి సహకరించిన అనురాధ అనే మహిళను కూడా అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.మరోక కేసులో ఇంటి తాళాలు పగులకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఫరీద్ ఖాన్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరించారు. బైట్: ఏఆర్ శ్రీనివాస్, పశ్చిమ మండలం డీసీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.