ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి.. కార్మికుల పాలిట శాపంగా మారింది. రోజుకొక కార్మికుడు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నాడు. వరంగల్ జిల్లా హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ రవీందర్ మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీసీ ఐకాస నేతలు పరామర్శకు వస్తుండటం వల్ల... ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఇది చదవండి: సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రాజస్థానీ అల్లుళ్లు..!