పర్యాటక, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ సహా పలు ఇతర రంగాల్లో మలేషియాతో తెలంగాణకు వ్యాపార అవకాశాలున్నాయని టీఎస్‌ఐఐసీ వైస్ ఛైర్మన్ నరసింహా రెడ్డి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో భారత, మలేషియాల మధ్య నూతన వ్యాపార అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని ఎఫ్‌టీసీసీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి నరసింహారెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. మలేషియా నుంచి ప్రతినిధులతో పాటు చెన్నైలోని కాన్సూలేట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే భారత్- మలేషియా మధ్య వాణిజ్య ఒప్పందం ఉందని... భాషాపరంగా, వాతావరణం రిత్యా మలేషియాతో తెలంగాణకు పోలికలు ఉన్నాయని అన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్