ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల, ఉపాధి కల్పన సంస్థ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు కోరారు. బషీర్బాగ్ పరిశ్రమల భన్లో ఔట్సోర్సింగ్, అటెండర్లు, డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందజేశారు. సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రించగలిగినట్టు తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు