ETV Bharat / city

'రాష్ట్ర రాబడి ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలి' - telangana budget 2021 news

రాష్ట్రంలోనూ బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. పద్దు సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్.. ప్రతిపాదనల తయారీపై దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

kcr
బడ్జెట్​ కసరత్తు.. ప్రతిపాదనల రూపకల్పనపై కేసీఆర్​ దిశానిర్దేశం
author img

By

Published : Feb 5, 2021, 5:26 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​పై కసరత్తు ప్రారంభమైంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో సమావేశమైన సీఎం.. బడ్జెట్ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.

కేంద్ర బడ్జెట్ వచ్చిన నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన దిశగా... ఆయా అంశాలపై అధికారులతో సమీక్షించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్ల విషయమై.. సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఉపాధిహామీ కేటాయింపులు, ఆహార, ఎరువులు, పెట్రోలియం రాయితీల్లో తగ్గుదల... పన్నుల్లో వాటాలో తగ్గుదల తదితర అంశాలను అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి... ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం.. చేసిన ఖర్చు, వివరాల గురించి సీఎం సమీక్షించినట్లు సమాచారం.

కేంద్ర నిధులపై ఆరా..

ఆయా పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, తదితర వివరాలను.. అధికారుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుసుకున్నారు. కరోనా, లాక్‌డౌన్ వల్ల తగ్గిన ఆదాయాలు.. క్రమంగా పుంజుకుంటున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధిరేటు, అవకాశాల విషయమై చర్చించారు. బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు సంబంధించి.. అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సమావేశాల తేదీలపై..

కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర స్వీయ ఆదాయం అంచనా ఆధారంగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అవసరాలను.. ప్రాధామ్యాల వారీగా గుర్తించాలని చెప్పినట్లు తెలిసింది. ఆయా శాఖలను సంప్రదించి ప్రతిపాదనలు రూపొందించాలని... అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తేదీలపై ఇంకా నిర్ణయానికి రానట్లు సమాచారం. వచ్చే నెల మొదటి లేదా.. రెండో వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీచూడండి: విన్నపాలు బుట్టదాఖలు.. రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.