ETV Bharat / city

ఈనెల 6 నుంచి ఐసెట్​ కౌన్సెలింగ్​ ప్రారంభం

author img

By

Published : Dec 2, 2020, 8:01 PM IST

ఈ నెల 6 నుంచి ఐసెట్​ కౌన్సెలింగ్​ ప్రారంభం కానుంది. 6 నుంచి 12 వరకు ఆన్​లైన్​లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. 15న మొదటి విడత, 22న చివరి విడత కౌన్సెలింగ్ జరగనున్నట్లు ప్రకటించారు.

Ts- icet counselling schedule released
Ts- icet counselling schedule released

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు ఈనెల 6 నుంచి 12 వరకు ఆన్​లైన్​లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 8 నుంచి 13 వరకు వెబ్​ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు.

15న మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు 15 నుంచి 19 వరకు ఆన్​లైన్​లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 22న చివరి విడత కౌన్సెలింగ్ పక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడత ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులు.. 22న ఆన్​లైన్​లో స్లాట్ బుక్​ చేసుకొని.. 23న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

ఈ నెల 26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయిస్తారు. 26 నుంచి 29 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ కాలేజీల్లో తక్షణ ప్రవేశాల కోసం 28న మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో తుదిపోలింగ్ 46.55 శాతం.. ఓల్డ్ మలక్​పేటలో రేపు రీపోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.