బక్రీద్ సందర్భంగా గోవులను వధించవద్దని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. బక్రీద్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డితో శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అన్ని మతాలను గౌరవించుకుంటున్నామని, ఇదే తరహాలో బక్రీద్‌ను జరుపుకొందామని అన్నారు.
చార్మినార్‌లోని 4 మినార్లను హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌లుగా భావిస్తామన్నారు. అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించుకుందామని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. వ్యర్థాలను రోడ్డు, వీధుల్లో పారవేయవద్దని అన్నారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతికదూరం పాటించాలని కోరారు.