ETV Bharat / city

చట్టాలు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించలేం : హైకోర్టు - yts high court latest news

చట్టాలు, నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యత శాసన, పాలన వ్యవస్థలదేనని పేర్కొంది. ముస్లిం శ్మశానవాటికలను కబ్జాల నుంచి పరిరక్షించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగ్గా... చట్టాల కోసం ప్రజలు శాసనవ్యవస్థను అడగాలని, కోర్టులను కాదని వ్యాఖ్యానించింది.

చట్టాలు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించలేము: హైకోర్టు

author img

By

Published : Jul 17, 2020, 6:59 PM IST

ముస్లిం శ్మశానవాటికలను కబ్జాల నుంచి పరిరక్షించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ముస్లిం శ్మశానవాటికల పరిరక్షణకు నిబంధనలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సామాజిక కార్యకర్త మహమ్మద్ ఇలియాస్ కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

చట్టాలు, నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యత శాసన, పాలన వ్యవస్థలదేనని పేర్కొంది. పరిధి దాటి ఆదేశాలు ఎలా ఇవ్వగలమని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. చట్టాల కోసం ప్రజలు శాసనవ్యవస్థను అడగాలని, కోర్టులను కాదని వ్యాఖ్యానించింది. ఏ శ్మశానవాటిక కబ్జా అయిందో ఆధారాలు ఇస్తే విచారణ చేపట్టగలమని తెలిపింది. ఆధారాలను సమర్పించేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.