ETV Bharat / city

బీటెక్​ సీట్ల కేటాయింపు... మిగిలినవి 19,998 మాత్రమే! - హైదరాబాద్​ తాజా వార్తలు

ఇంజినీరింగ్‌ కన్వీనర్ కోటా మెుదటి విడత సీట్ల కేటాయింపు పూర్తైంది. దాదాపు 71.49 శాతం సీట్లు కేటాయించగా... మరో 19,998 మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 యూనివర్సిటీ.. 35 ప్రైవేట్ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అవ్వగా.....మూడు ప్రైవేట్ కళాశాలల్లో ఒక్క విద్యార్థి చేరలేదు. ఈ ఏడాది కూడా సీఎస్​ఈలో చేరేందుకే విద్యార్థులు ఆసక్తి కనబరిచారు.

బీటెక్​ సీట్ల కేటాయింపు.. మిగిలినవి 19,998 మాత్రమే

author img

By

Published : Oct 25, 2020, 6:58 AM IST

ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయించారు. కన్వీనర్ కోటాలో 178 కళాశాలల్లో 70,135 బీటెక్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టగా... వాటిలో 71.49 శాతం కేటాయింపు పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా 50,137 సీట్లు భర్తీ అవ్వగా... మరో 19,998 సీట్లు మిగిలాయి. 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు అన్నీ నిండాయి. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీ కళాశాలల్లో... 3,151 సీట్లు ఉండగా... కేవలం 60 మిగిలిపోయాయి. 164 ప్రైవేట్ కళాశాలల్లో 66,984 సీట్లకుగాను... 47,046 సీట్లు భర్తీ అయ్యాయి. మూడు ప్రైవేట్ కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. దాదాపు 54,981 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. 4,603 మందికి సీటు దక్కలేదు.

ఈనెల 29న తుదివిడత కౌన్సెలింగ్​

ఈ ఏడాది ఇంజినీరింగ్​లో 45 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏరోనాటికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ వంటి కొత్త కోర్సులను విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నా... మరికొన్నింటికి ఆశించిన స్పందన రాలేదు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్​లో దాదాపు సగం సీట్లు మిగిలాయి. మరోసారి సీఎస్​ఈలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. ఫార్మా కోర్సుల్లో చేరేందుకు ఎంపీసీ అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. బీఫార్మసీలో 151, ఫార్మా- డీలో కేవలం 30 మాత్రమే భర్తీ అయ్యాయి. అభ్యర్థులు ఈనెల 28 వరకు ఆన్​లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్​ నవీన్ మిత్తల్ తెలిపారు. మిగిలిన సీట్ల కోసం ఈనెల 29 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు.

క్రీడా కోటా అభ్యర్థుల ప్రాధాన్యతలు స్పోర్ట్స్ అథారిటీ నుంచి అందకపోవడం వల్ల వారికి తుదివిడతలో సీట్లు కేటాయించనున్నారు.

ఇదీ చూడండి: ఇప్పటి వరకు 21.81 లక్షల ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.