ప్రగతి భవన్ ముట్టడించేందుకు టీఆర్టీ దివ్యాంగ అభ్యర్థులు యత్నించారు. ప్రభుత్వం వెంటనే టీఆర్టీ తుది ఫలితాలు ప్రకటించి... నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. 2017 ఏడాదికి చెందిన 500 మందికి పైగా దివ్యాంగ అభ్యర్థులను ఆదుకోవాలని కోరారు. ధ్రువపత్రాల పరిశీలన చేసి ఏళ్లు గడిచిన నియామకాలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదీ చూడండి: "సమత' కాదు... వారి ఉరే మాకు సంతృప్తి"