తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ అకుంఠిత దీక్ష, ఉద్యమస్ఫూర్తి తో 2001 సంవత్సరంలో శ్రీకారం చుట్టిన స్వరాష్ట్ర ఉద్యమకాంక్షకు... లక్షల మంది చేయి చేయి కలిపి... విద్యార్థులు, యువత త్యాగాలు, ఆత్మబలిదానాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని పేర్కొన్నారు. అదే ఉద్యమ నాయకుని పాలన, నాయకత్వంలో ఆరేళ్లుగా రాష్ట్రం ప్రజ్వరిల్లుతోందన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ ప్రభోదించిన స్వేచ్ఛా, స్వాతంత్రాలు వెలిబుచ్చే సందేశాలు జతచేశారు.
ఇదీ చూడండి: ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు