ETV Bharat / city

ఈ సారి సెంచరీ కొట్టాల్సిందే.. అభ్యర్థుల్లో ఉత్సాహం నింపిన కేటీఆర్ - ghmc elections-2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని పార్టీ అభ్యర్థులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అహంకారం లేకుండా అందరినీ కలుపుకుపోవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. పది రోజుల్లో ప్రతి గడపకు వెళ్లి ఓటర్ల ఆశీర్వాదం కోరాలని సూచించారు. ఆరేళ్లలో రాజధానిలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. భాజపా ఏం చేసిందంటూ ప్రజల్లో చర్చనీయాంశం చేయాలన్నారు. అభ్యర్థులు ఇవాళ బీఫారాలను సమర్పించి..కేటీఆర్ మార్గనిర్దేశనంలో మధ్యాహ్నం నుంచి పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగనున్నారు.

trs working president ktr encourage ghmc corporator candidates
ఈ సారి సెంచరీ కొట్టాల్సిందే.. అభ్యర్థుల్లో ఉత్సాహం నింపిన కేటీఆర్
author img

By

Published : Nov 21, 2020, 5:19 AM IST

తెరాస కార్పొరేటర్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార వ్యూహాన్ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. జీహెచ్​ఎంసీ పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులకు నిన్న తెలంగాణ భవన్ లో బీ ఫారాలు పంపిణీ చేసిన కేటీఆర్.. ఈ పది రోజులు అనుసరించాల్సిన తీరును వివరించారు. ఆరేళ్లలో సాధించిన అభివృద్ధే ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లాలని కేటీ రామారావు చెప్పారు. టికెట్ దక్కిందన్న గర్వం, అహంకారం ఉండకూడదని.. టికెట్ ఆశించిన మిగతా నేతల వద్దకు వెళ్లి సహకరించాలని కోరాలని.. పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని చెప్పారు. రానున్న పది రోజులు 24 గంటలూ పనిచేయాలని స్పష్టం చేశారు. ఇంటింటికీ తిరిగి.. ప్రతీ గడప తొక్కి.. హైదరాబాద్ లో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించి ఆశీర్వాదం కోరాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ ఉదయమే బీఫారాలు సమర్పించి.. మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయి ప్రచారంలో నిమగ్నం కావాలని వివరించారు.

హైదరాబాద్​ ఇంజిన్​..

తెరాస విడుదల చేసిన హైదరాబాద్ ప్రగతి నివేదికను అభ్యర్థులందరూ అధ్యయనం చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు తమ డివిజన్ తో పాటు.. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. ప్రభుత్వం చేసిన పనులు చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఏం చేసిందో ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చ తీసుకు రావాలన్నారు. కరోనా కష్టాలు, వరద నష్టాల్లో ప్రజలకు అండగా ఉన్నది తెరాస నాయకులు, కార్యకర్తలేనని.. ప్రతిపక్షాలు ఎక్కడున్నాయని ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. అభివృద్ధి కావాలా.. అశాంతి కావాలో ఆలోచించాలని ప్రజలను కోరాలన్నారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో నగరమంతటా చర్చనీయాంశంగా చేయాలని పార్టీ అభ్యర్థులకు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ లాంటిదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికే కీలకమైన ఎన్నిక కాబట్టి ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దని.. ప్రజల ఆశీర్వాదం కోరారు.

దమ్ముందా..?

బండి సంజయ్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గెలిస్తే రూ. 25 వేలు ఇస్తామంటున్న వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయన్నారు. ట్రాఫిక్ చలాన్లు తామే కడుతామంటున్న భాజపా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించాలన్నారు. భాజపాకు ధర్నా చేయడానికి నగరంలో గుడులే లేవా... భాగ్యలక్ష్మి ఆలయానికే ఎందుకు వెళ్లారన్న కేటీఆర్... ఆ పార్టీ ఎప్పుడూ మత గొడవలే కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి వరద సాయం చేయలేదని... భాజపాకు దమ్ముంటే హైదరాబాద్ కు లక్ష కోట్ల రూపాయలు ప్యాకేజీ తేవాలన్నారు.

నేటి నుంచి పూర్తి స్థాయి ప్రచారం

కేటీఆర్ దిశానిర్దేశంతో తెరాస అభ్యర్థులు నేటి నుంచి పూర్తిస్థాయి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న రాత్రే అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు, కార్యకర్తలను కలిసిన అభ్యర్థులు ఇవాళ మరికొందరిని కలిసేందుకు ప్రణాళికలు చేశారు. డివిజన్ ఇంచార్జిగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనతో ఇంటింటి ప్రచారానికి సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస సెంచరీ కొట్టాల్సిందేనంటూ అభ్యర్థుల్లో కేటీఆర్ ఉత్సాహాన్ని నింపారు. గత ఎన్నికల్లో సెంచరీ కొట్టాలనుకున్నప్పటికీ.. ఒక పరుగు తేడా వచ్చిందన్నారు. పార్టీ స్థానిక శ్రేణులతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలతో కలిసి.. విజయం సాధించాలన్నారు.

ఇదీ చూడండి: మేయర్ పీఠమే లక్ష్యంగా కేటీఆర్​ ప్రచారం.. నేటి నుంచి రోడ్​ షోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.