ETV Bharat / city

ఈసీని కలిసిన టీఆర్​ఎస్ బృందం, బీఆర్​ఎస్​పై పార్టీ తీర్మానం అందజేత - Bharat Rashtra Samithi office in Delhi

TRS team meets EC: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన టీఆర్​ఎస్.. అధికారికంగా ఆ పనులు ప్రారంభించింది. ఇవాళ ఆ పార్టీ సభ్యుల బృందం దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. పార్టీ తీర్మానం కాపీని అందించారు. పేరు మార్పుకు ఆమోదం తెలపాలని తెరాస బృందం ఈసీకి విజ్ఞప్తి చేసింది.

vinod
vinod
author img

By

Published : Oct 6, 2022, 11:57 AM IST

Updated : Oct 6, 2022, 12:20 PM IST

TRS team meets EC: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన టీఆర్​ఎస్.. అధికారికంగా ఆ పనులు ప్రారంభించింది. ఇవాళ ఆ పార్టీ సభ్యుల బృందం దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. పార్టీ తీర్మానం కాపీని అందించారు. పేరు మార్పుకు ఆమోదం తెలపాలని తెరాస బృందం ఈసీకి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పు ప్రక్రియను ఆ పార్టీ నేతలు ప్రారంభించారు.

ఈసీని కలిసిన వినోద్​ కుమార్​ బృందం: నిన్న తెలంగాణ భవన్​లో పార్టీ చేసిన తీర్మానం కాపీని తీసుకొని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. టీఆర్​ఎస్​ను భారత్ రాష్ట్ర సమితి-బీఆర్​ఎస్​గా మారుస్తూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందజేశారు.

పేరు మార్పుకు ఆమోదం తెలపాలని కోరనున్న వినోద్ కుమార్ బృందం ఈసీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఇందుకు ఎన్నికల సంఘం అధికారులు ఆమోదం తెలిపితే.. అధికారికంగా టీఆర్​ఎస్.. బీఆర్​ఎస్ పార్టీగా మారుతుంది.

"చట్టప్రకారం పీపుల్స్​ రిప్రజెంటివ్​​ యాక్ట్​ సెక్షన్​ 29A(9) లో స్పష్టంగా ఉంది. ఏ పార్టీ అయినా ఆ పార్టీ పేరును, చిరునామాను మార్చితే వేంటనే ఎలక్షన్​ కమిషన్​కి తెలియజేయాలి. అందుకే సమయం వృథా చేయకుండా మేము వెంటనే.. నిన్న తీసుకున్న తీర్మాన పత్రాన్ని ఈరోజు ఈసీకి ఇవ్వడం జరిగింది. మిగతా విషయాలు ఎలక్షన్​ నిబంధనలు అనుసరించి ఉండబోతున్నాయి."- వినోద్​ కుమార్​, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు

ఈసీని కలిసిన టీఆర్​ఎస్ బృందం, బీఆర్​ఎస్​పై పార్టీ తీర్మానం అందజేత

ఇవీ చదవండి:

Last Updated : Oct 6, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.