ETV Bharat / city

TRS: మమతా బెనర్జీతో సమావేశానికి తెరాస దూరం

TRS not to attend Opposition meeting today: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిల్లీలో నేడు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకూడదని తెరాస నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున ప్రతినిధులు ఎవరూ హాజరుకాకూడదని పేర్కొన్నారు. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్​ను ఆహ్వానించడంపై అసంతృప్తితో అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

kcr on opposition meeting
kcr on opposition meeting
author img

By

Published : Jun 15, 2022, 2:03 AM IST

Updated : Jun 15, 2022, 5:13 AM IST

KCR Escape Mamatha Banerjee meeting: ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ఇవాళ దిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కారాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. పార్టీ తరఫున కూడా ఎవరినీ పంపరాదని నిశ్చయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించవద్దని మమతను కోరినా, ఫలితం లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యనేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. దిల్లీలో విపక్షాల భేటీకి హాజరు కావాలా, వద్దా అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. చివరకు వెళ్లకూడదనే నిర్ణయించారు. ఇందుకు కేసీఆర్‌ ప్రధానంగా నాలుగు కారణాలను పేర్కొన్నట్లు తెలిసింది.

గత ఎనిమిదేళ్లుగా భాజపా, కాంగ్రెస్‌లకు తెరాస సమదూరం పాటిస్తుండడం, ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన సందర్భంగా.. కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా తెరాస అభ్యర్థిని ఓడించేందుకు భాజపాతో కాంగ్రెస్‌ కుమ్మక్కవడం, మమత సమావేశం నిర్వహిస్తున్న తీరే సరిగా లేకపోవడం.. ఈ కారణాలతో కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘వీటన్నిటి దృష్ట్యా దిల్లీలో కాంగ్రెస్‌ పాల్గొనే విపక్ష సమావేశానికి హాజరైతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’.. అని కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికే ప్రధానాంశమైనప్పటికీ.. తెలంగాణలో తమకు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ హాజరయ్యే సమావేశానికి వెళ్లడం వల్ల ఆ పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నామనే భావన ప్రజల్లో వస్తుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైనట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ వద్దని మమతను కోరినా...: మమతా బెనర్జీ ఇటీవల తనకు ఫోన్‌ చేసినప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కోరానని పార్టీ నేతలకు సీఎం వివరించినట్లు తెలిసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ స్పందనను తెలుసుకోవాలని సూచించానని ఆయన వెల్లడించినట్లు సమాచారం. అయినా మమత కాంగ్రెస్‌ను ఆహ్వానించారని, అందువల్ల ఆ సమావేశంలో తాను పాల్గొనడం సబబు కాదని భావిస్తున్నానని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఖరారయ్యాక, తమను సంప్రదిస్తే మద్దతు విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

21 లేదా 22న విస్తృతస్థాయి సమావేశం! : కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఈ నెల 21 లేదా 22న తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తెరాస యోచిస్తోంది. దీనిపై ఒకటి, రెండురోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే భారాస (భారత్‌ రాజ్య సమితి) పేరిట కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ ఏర్పాట్లు ప్రారంభించారు. తెరాసనే భారాసగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తీర్మానం చేసి పంపాల్సి ఉన్నందున రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తామని ఇటీవల పార్టీ నేతలతో చెప్పారు. దీనికోసం 21, 22 తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఇదీచదవండి:

Last Updated : Jun 15, 2022, 5:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.