TRS MPs Comments: దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. కులాలవారీగా జనాభా లెక్కలు ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నామన్న ఎంపీలు... కులగణనపై నోటీసు ఇచ్చామని తెలిపారు. లోక్‌సభలో చర్చకు అనుమతించకపోవడం వల్ల వాకౌట్ చేశామని వెల్లడించారు.
"కులాలవారిగా జనాభా లెక్కల్లో కచ్చితత్వం లేకపోతే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సరైన జనాభా లెక్కలు లేకపోతే.. సామాజిక న్యాయం జరగదు. ప్రస్తుతం ప్రాంతాల వారిగా ఎస్టీలను లెక్కలోకి తీసుకుంటున్నాం. నిర్ణయంచిన ప్రాంతం బయట కూడా ఎంతో మంది ఎస్టీలు ఉన్నారు. అందుకే.. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది." - కె.కేశవరావు, రాజ్యసభ సభ్యులు
"దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తోన్నా.. ఇప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కులగణన గురించి ఏ ప్రభుత్వం ఆలోచించనేలేదు. మా నాయకుడు, సీఎం కేసీఆర్.. ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అటు పార్లమెంటులో, ఇటు అసెంబ్లీలో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని.. కేంద్రస్థాయిలో వాళ్లకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2014లోనే ఏకగ్రీవ తీర్మానాన్ని పంపించారు. దాన్ని ఇప్పటివరకు పట్టించుకోకపోవటం బాధాకరం. అందుకే ఇవాళ నోటీసులిచ్చాం." - నామ నాగేశ్వరరావు, లోక్సభాపక్షనేత
దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తెరాస డిమాండ్
ఇదీ చూడండి: