సాగుచట్టాలపై రైతుల ఆందోళనకు ముగింపు పలికేందుకు పార్లమెంటు వేదికగా కార్యాచరణను రూపొందించాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సూచించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన... రైతుల ఆందోళనను పరిష్కరించాలని సూచించారు. సాగుచట్టాల్లో అవసరమైన సవరణలు చేయాలని తెలిపారు.
రాష్ట్రానికి చెందిన అంశాల్లో కేంద్రం చేసిన ఈ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉంటాయని తెలిపిందని కేశవరావు సభ దృష్టికి తెచ్చారు. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యరంగానికి పెద్దపీటవేయడం అభినందనీయమని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా సీజేఐకి 141మంది లాయర్లు లేఖ