కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసినందుకు అమిత్ షా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి కీలక ప్రాజెక్టులకు కూడా ఒక్క రూపాయి కేటాయించలేదని.. తెలంగాణ ప్రజలను భాజపాలో ఎందుకు చేరాలో అమిత్ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ కక్షపూరిత వైఖరి కేంద్ర బడ్జెట్‌తో బయటపడిందన్నారు.
ఇదీ చూడండి: బడ్జెట్‌పై ట్విట్టర్లో కేటీఆర్ అసంతృప్తి