ETV Bharat / city

'మహా'రాష్ట్ర సమితి..!

తెలంగాణలో వరుస విజయాలతో జోరుమీదున్న అధికార తెరాస.. త్వరలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. మహారాష్ట్రాలోని నాందేడ్​ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో పాటు భీవండి, షోలాపూర్​, రజూర నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

'మహా'రాష్ట్ర సమితి..!
author img

By

Published : Sep 18, 2019, 5:02 AM IST

Updated : Sep 18, 2019, 7:44 AM IST

'మహా'రాష్ట్ర సమితి..!

మహారాష్ట్రాలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నాందేడ్​ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, ఇతర ప్రాంతాల్లోని మరో 3 నియోజకవర్గాలు కలిపి మొత్తం 8 చోట్ల బరిలోకి దిగే అవకాశం ఉంది. హైదరాబాద్​ శాసనసభ కార్యాలయంలో సీఎం కేసీఆర్​తో నాందేడ్ జిల్లా నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. వీలుకాని పక్షంలో ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలనే నినాదంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తమకు తెరాస టికెట్లు ఇవ్వాలని కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు గులాబీ అధినేత సూత్రపాయంగా అంగీకరించినట్లు సమాచారం. త్వరలో భాజపా, కాంగ్రెస్​, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల స్థానిక నాయకులతో వచ్చి కలుస్తామని నాందేడ్​ నేతలు తెలిపారు.

ఎనిమిది స్థానాలపై గురి

తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు.. తమకూ కావాలని కోరుకోవడం సహజమని.. వారి ఆకాంక్షను మహారాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. నాందేడ్​ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతో పాటు భీవండి, షోలాపూర్​, రజూర ప్రాంతాల వారు తెరాస టికెట్లు అడుగుతున్నారని.. వారి వినతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్​ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి..

Intro:Body:Conclusion:
Last Updated : Sep 18, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.