కాంగ్రెస్ నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై తెరాస నేతలు ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ చీకటి కోణం అందరికీ తెలుసని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. వట్టినాగులపల్లిలో రేవంత్‌కు సంబంధించిన బంధువులు, సోదరుడు పేరు మీద అక్రమ కట్టడాలు ఉన్నాయని.. ఆరోపించారు. దీనిపై రేవంత్ తక్షణం స్పందించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్.. ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్పష్టం చేశారు.
వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రచారంలోకి వస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ గోబెల్ ప్రతినిధుల సాక్షిగా రేవంత్ అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఐరెన్ లెగ్ అని ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా అవి భూస్థాపితం అయిపోతున్నాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రేవంత్‌రెడ్డిని అభివర్ణించారు.
ఇవీచూడండి: కేటీఆర్... మంత్రి పదవికి రాజీనామా చేయాలి: కాంగ్రెస్