ETV Bharat / city

బండి సంజయ్​పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు - telangana Election Commission

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మతం పేరిట లబ్ది పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని తెరాస ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సోషల్​ మీడియాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

trs leaders Complaint to the telangana Election Commission against Bandi Sanjay
బండి సంజయ్​పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
author img

By

Published : Mar 10, 2021, 7:38 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై చర్యలు తీసుకోవాలని తెరాస కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్​ను కలిసి ఫిర్యాదు చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మతం పేరిట లబ్ది పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని అన్నారు. ఏం చేస్తారో చెప్పలేక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కుట్రతో లబ్దిపొందాలని చూస్తున్నారని ఆక్షేపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫేస్​బుక్, ట్విట్టర్​లో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని, చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

బండి సంజయ్​పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఇదీ చూడండి : సౌర విద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది: హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.