ETV Bharat / city

తెరాసలో కొత్తవారికి అవకాశం.. 26డివిజన్లలో టికెట్లు - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తాజా వార్తలు

గ్రేటర్​ బరిలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో తెరాస ఆచితూచి వ్యవహరించింది. క్షేత్రస్థాయి పరిశీలనలు, ఇప్పటి వరకు సదరు నేతలపై ఉన్న ఆరోపణలు, పనితీరుతో పాటు అనేక అంశాలపై గ్రౌండ్​ వర్క్​ చేసింది. ఇందులో భాగంగానే 26 డివిజన్లలో కొత్త వారికి అవకాశం కల్పించింది.

trs ground level work for the  selection of candidates to compete in the GHMC elections 2020
క్షేత్రస్థాయిలో కసరత్తులు.. ఆచితూచి అడుగులు
author img

By

Published : Nov 21, 2020, 7:51 AM IST

గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపికలో తెరాస ఆచితూచి వ్యవహరించింది. క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై కసరత్తు చేసి 26 డివిజన్లలో కొత్తవారికి టికెట్లు కేటాయించింది. ఆ మేరకు ఉప్పల్‌ నియోజకవర్గంలో ముగ్గుర్ని మార్చింది. ఉప్పల్‌ కార్పొరేటర్‌ అనలారెడ్డి భర్తపై ఆరోపణలు రావడంతో ఆ స్థానం మరొకరికి కేటాయించింది. చిలుకానగర్‌ కార్పొరేటర్‌ గోపి సరస్వతి భర్తకు, స్థానిక ఎమ్మెల్యేకు మధ్య సఖ్యత లేదని అధిష్ఠానం వేరే వారికి టికెట్‌ ఇచ్చింది.

మీర్‌పేట్‌లోనూ ఇదే పరిస్థితి. తార్నాక సిట్టింగ్‌ కార్పొరేటర్‌ ఆలకుంట్ల సరస్వతి భర్తపై ఇటీవలి కాలంలో పలు ఆరోపణలు రావడంతో నేతలు ఇక్కడా మార్చేశారు. అడ్డగుట్ట కార్పొరేటర్‌ పనితీరు సంతృప్తికరంగా లేదని వేరొకరికి టికెట్‌ను కేటాయించారు. అంబర్‌పేటలో ఇద్దరు సిట్టింగ్‌లను మార్చారు. ముగ్గురు సంతానం ఉండటంతో కాచిగూడ కార్పొరేటర్‌ను అధిష్ఠానం పక్కన పెట్టింది. జూబ్లీహిల్స్‌లో వెంగళ్‌రావునగర్‌ టికెట్‌ను దేదీప్యరావుకు ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ రహమత్‌నగర్‌, యూసఫ్‌గూడ సిట్టింగ్‌లను పక్కన పెట్టారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నేరేడ్‌మెట్‌, తూర్పు ఆనంద్‌బాగ్‌, గౌతంనగర్‌లో ముగ్గురు సిట్టింగ్‌లను మార్చారు.

ఇవీ చూడండి: బల్దియా పోరు: కసరత్తు ముగిసింది.. ప్రచారమే మిగిలింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.