ఆయనో వృక్ష ప్రేమికుడు. మొక్కలే ఆయనకు నేస్తాలు. చెట్లే ఆయనకు కాలక్షేపం. మొక్కలను తన పిల్లలకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ చెట్ల చెంతనే సేద తీరుతారు, మాట్లాడతారు. చెట్లే ఆయనకి సర్వస్వం. ఇంతకీ ఆయన ఉండేది ఏ అడవుల్లోనో కాదు.. చెన్నై మహా నగరంలో. పంజాబ్ నుంచి చెన్నై వచ్చి స్థిరపడిన ఓ వృక్ష ప్రేమికుడు తన ఇంటిని వనంలా మార్చుకున్నారు. 350కి పైగా అరుదైన చెట్లు, మొక్కలు, మూలికలను ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. వృక్షో రక్షతి రక్షితః అన్న మాటను అక్షరాలా అవలంభిస్తున్న జస్వంత్ సింగ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇవీ చదవండి..