ETV Bharat / city

హైదరాబాద్​లో 18 నుంచి 'మెగా ప్రాపర్టీ షో' - హైదరాబాద్​లో ఈ నెల 18 నుంచి 20 వరకు 'మెగా ప్రాపర్టీ షో'

హైదరాబాద్​లో ఫ్లాట్లు, విల్లాలు, ప్రాపర్టీని కొనుగోలు చేసే వారికి శుభవార్త. ట్రిడా ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20 వరకు 'మెగా ప్రాపర్టీ షో' జరుగనుంది. ఈ మెగా ఈవెంట్​లో వందమందికి పైగా బిల్డర్లు, డెవలపర్లు పాల్గొననున్నట్లు నిర్వహకులు తెలిపారు.

హైదరాబాద్​లో ఈ నెల 18 నుంచి 20 వరకు 'మెగా ప్రాపర్టీ షో'
author img

By

Published : Oct 10, 2019, 11:26 PM IST

హైదరాబాద్​లో ఈ నెల 18 నుంచి 20 వరకు 'మెగా ప్రాపర్టీ షో'

కలల ఫ్లాట్, విల్లా కొనుగోలు చేయాలని చూస్తోన్న వారి కోసం 'మెగా ప్రాపర్టీ షో' నిర్వహించనున్నట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రిడా) ప్రకటించింది. ట్రిడా ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఈనెల 18 నుంచి 20 వరకు మూడురోజులపాటు ఈ ప్రాపర్టీ ప్రదర్శన జరగనుంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్​లో సరసమైన ధరలలో ఆస్తులు లభ్యమవుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుకూల విధానాలు, అంతర్జాతీయ సంస్థల రాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చిందని వారు అన్నారు. ఈ మెగా ఈవెంట్​లో వంద మందికి పైగా బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాపర్టీల ప్రదర్శన చేయనున్నారని.. కొనుగోలుదారులు వారి అభిరుచికి అనువైన విల్లాలు, ఫ్లాట్లు, ప్రాపర్టీలు ఎంచుకునే వీలుందని నిర్వాహకులు తెలిపారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.