ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన ఆర్టీసీ ఈడీ (అడ్మిన్ హైదరాబాద్) వెంకటేశ్వరరావు చిత్రపటానికి ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళి అర్పించారు. వెంకటేశ్వరరావు కుటుంబానికి ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెంకటేశ్వరరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని మంత్రి పువ్వాడ అన్నారు. టి.వి.రావు.. ఆర్టీసీకి అందించిన సేవల్ని కొనియాడారు. తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని, సంస్థ అభివృద్ధిలో ఆయన సేవలు మరవలేనివని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: 'ముందుంది మంచి కాలం- మళ్లీ నా గెలుపు తథ్యం'