ETV Bharat / city

'విద్యుత్​ బిల్లుపై తెలంగాణ వైఖరిలో మార్పు లేదు' - Telangana Transco-Genco CMD

విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెస్తున్న బిల్లు ముసాయిదాను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోని అంశాలకే రాష్ట్ర సర్కార్ కట్టుబడి ఉందని ట్రాన్స్​కో-జెన్​కో సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు.

cmd prabhakar rao, transco and genco cmd
ట్రాన్స్​కో సీఎండీ, జెన్​కో సీఎండీ, సీఎండీ ప్రభాకరరావు
author img

By

Published : Apr 6, 2021, 6:41 AM IST

విద్యుత్‌ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పులేదని ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టంచేశారు. విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెస్తున్న బిల్లు ముసాయిదాను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ గత జూన్‌ 2న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, అందులోని అంశాలకే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎండీ వివరించారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు.

‘‘వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలి. విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రాంతాలవారీగా ప్రైవేటు పరం చేయాలి’’ తదితర సంస్కరణలను ఈ బిల్లులో కేంద్రం పొందుపరిచింది. బిల్లులోని ఆయా అంశాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన లేఖలో గుర్తుచేశారు. విద్యుత్‌ బిల్లుపై అన్ని రాష్ట్రాల వైఖరిని తెలుసుకునేందుకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌లో అన్ని రాష్ట్రాల ఇంధనశాఖల కార్యదర్శులు, విద్యుత్‌ సంస్థల సీఎండీలతో సమావేశం నిర్వహించారు. అందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం బిల్లును స్వాగతించిందని మినిట్స్‌లో తెలుపుతూ ఇటీవల కేంద్ర విద్యుత్‌శాఖ ప్రకటించింది. దీంతో విద్యుత్‌బిల్లును గతంలో వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు దానికి ఆమోదం తెలిపిందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున తాను బిల్లును స్వాగతించలేదని ప్రభాకరరావు తాజా లేఖలో స్పష్టంచేశారు. ‘ఈ బిల్లుపై అన్ని రాష్ట్రాల వైఖరులను తెలుసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటుచేయడాన్ని మాత్రమే నేను స్వాగతించా. బిల్లులోని అంశాలను స్వాగతించినట్లు మినిట్స్‌లో నమోదు చేయడం సరికాదు. సీఎం కేసీఆర్‌ గతంలో రాసిన లేఖ ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లుపై వ్యవహరిస్తుంది’’ అని తేల్చిచెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.